UPSC Nursing Officer (నర్సింగ్ ఆఫీసర్ నోటిఫికేషన్)

UPSC నుండి  నర్సింగ్ ఆఫీసర్ 1930 ఖాళీల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. అర్హులై, ఆసక్తి గల అభ్యర్ధులు క్రింద తెలియ చేసిన వివరాలను పరిశీలించి అప్లై చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు

అప్లికేషను చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 07-03-2024

చివరి తేది : 27-03-2024

అప్లికేషనులోని తప్పిదాలను సరిచేసుకోవడానికి తేదీలు : 28-03-2024 నుండి 03-04-2024 వరకు

పరిక్ష తేది : 07-07-2024

విద్య అర్హతలు

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.Sc నర్సింగ్ లేదా రాష్ట్ర కౌన్సిల్ బోర్డు నుండి నర్సింగ్ లేదా డిప్లొమా నర్సింగ్ చేసి ఉండవలెను. కచ్చితంగా మిడ్-వైఫ్ గా రిజిస్ట్రార్ చేసుకొని ఉండవలెను.

దరఖాస్తు రుసుము

జనరల్/ OBC అభ్యర్ధులకు 25/- రూపాయల దరఖాస్తు రుసుము కలదు. SC/ ST/ PwBD/ మహిళా అభ్యర్ధులకు ఎటువంటి పరిక్ష రుసుము లేదు. ఆన్లైన్ పద్ధతి ద్వారా మాత్రమే దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.

వయస్సు నిబంధనలు

కనీస వయసు 18 సం”లు , జనరల్ అభ్యర్ధులకు గరిష్ట వయసు 33 సం”లు, OBCఅభ్యర్ధులకు గరిష్ట వయసు 35 సం”లు, SC/ ST/ PwBD అభ్యర్ధులకు గరిష్ట వయసు 40 సం”లు ఉండవలెను. అంగవైకల్యం కలిగిన అభ్యర్ధులు కనీసం 40% పైగా ఉన్న వ్యక్తులు మాత్రమే ఇందుకు అర్హులు.

సిలబస్

  1. నర్సింగ్ ఫౌండేషన్
  2. మెడికల్ సర్జికల్ నర్సింగ్
  3. నర్సింగ్ ఎడ్యుకేషన్
  4. పెడియట్రిక్ నర్సింగ్
  5. మెంటల్ హెల్త్ నర్సింగ్
  6. నర్సింగ్ మనేజ్మేంట్
  7. నర్సింగ్ రిసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్
  8. ఓబ్స్టేట్రిక్స్ అండ్ గ్యనేకలోగికాల్ నర్సింగ్
  9. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్
  10. అనాటమీ
  11. ఫిసియోలజి
  12. సైకోలజి
  13. సోషయోలజి
  14. న్యూట్రిషన్
  15. మైక్రోబయాలజీ
  16. బయో-కెమిస్ట్రీ

ముఖ్యమైన విషయాలు

  • తప్పుడు సమాధానాలకు పెనల్టీ మార్కులు గలవు.
  • తెలుగు ప్రాంతాలకు చెందిన పరిక్ష కేంద్రాలు అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్
  • అప్లై చేయి సమయములో ఫోటో మరియు సంతకము అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి ధ్రువపత్రాలు అప్లోడ్ చెయ్యాల్సిన అవసరం లేదు.
  • పరిక్ష సమయానికి 7 రోజులకు ముందు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోగలరు.
  • విడాకులు లేదా వితంతు మహిళలు తమ రిజర్వేషన్ పొందుటకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయములో సంబధిత ధ్రువ పత్రాలు ఉండవలెను.
  • అవసరమైన సర్టిఫికెట్స్ మరియు పూర్తి విషయాలను నోటిఫికేషన్ లో తెలియ చెయ్యడం జరిగింది. ఇట్టి నోటిఫికేషన్ క్రింద PDF రూపములో పొందు పరచడము జరిగింది పరిశీలించగలరు.