RRB Technician Grade Recruitment Notification (రైల్వై టెక్నికల్ గ్రేడ్ పోస్టులు)

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నుండి టెక్నీషియన్ గ్రేడ్-1(సిగ్నల్), గ్రేడ్-3 9144 ఖాళీల భర్తికోసం నోటిఫికేషన్ విడుదల అయినది. ఈ నోటిఫికేషన్ కి సంబధించిన పూర్తి వివరాలు మొత్తం క్రింద తెలియ చెయ్యడం జరిగింది.

ఖాళీల వివరాలు

  1. టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ : 1092
  2. టెక్నీషియన్ గ్రేడ్-3 : 8052
  3. మొత్తం ఖాళీలు : 9144

ముఖ్యమైన తేదీలు

అప్లికేషన్ చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 09-03-2024

చివరి తేది : 08-04-2024

అప్లికేషన్ ఫారంలోని తప్పిదాలను సరిచేసుకోవడానికి తేదీలు : 09-04-2024

దరఖాస్తు రుసుము

జనరల్/ OBC అభ్యర్ధులకు 500/- రూపాయలు, SC/ ST/ PwBD/ మాజీ సైనికులు/ మహిళా అభ్యర్ధులకు 250/- రూపాయల దరఖాస్తు రుసుము కలదు.

విద్య అర్హతలు

టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ : డిప్లొమాలో ఇంజనీరింగ్ లేదా డిగ్రీలో ఇంజనీరింగ్ లేదా డిగ్రీ లో ఫిజిక్స్/ ఎలేక్రోనిక్స్/ కంప్యూటర్ సైన్సు నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

టెక్నీషియన్ గ్రేడ్-3 : SSC లేదా దానికి సమానమైన విద్యతో పాటుగా ITI నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

వయసు నిబంధనలు (01-07-2024 తేది వరకు)

టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ : కనీస వయసు 18 సం”లు, గరిష్ట వయసు 33 సం”లు ఉండవలెను.

టెక్నీషియన్ గ్రేడ్-3 : కనీస వయసు 18 సం”లు, గరిష్ట వయసు 30 సం”లు ఉండవలెను.

వయసు సడలింపు వివరాలు

SC/ ST అభ్యర్ధులకు 5 సం”లు, OBC (నాన్-క్రిమి లేయర్) అభ్యర్ధులకు 3 సం”లు, మాజీ సైనికులకు (SC/ ST అభ్యర్ధులకు 8 సం”లు, OBC (నాన్-క్రిమి లేయర్) అభ్యర్ధులకు 6 సం”లు, జనరల్ అభ్యర్ధులకు 3 సం”లు), PwBD అభ్యర్ధులకు (SC/ ST అభ్యర్ధులకు 15 సం”లు, OBC (నాన్-క్రిమి లేయర్) అభ్యర్ధులకు 13 సం”లు, జనరల్ అభ్యర్ధులకు 10 సం”లు), రైల్వే డిపార్టుమెంటులో పని చేస్తున్న అభ్యర్ధులకు (SC/ ST అభ్యర్ధులకు గరిష్ట వయసు 45 సం”ల వరకు, OBC (నాన్-క్రిమి లేయర్) అభ్యర్ధుల గరిష్ట వయసు 43 సం”ల వరకు, జనరల్ అభ్యర్ధుల గరిష్ట వయసు 40 సం”ల వరకు).

ఇతర ముఖ్యమైన విషయాలు

  • అప్లికేషను ఫారంలోని తప్పిదాలను సరిచేసుకోవడానికి రుసుము చెల్లించవలసి ఉంటుంది.
  • SC/ ST అభ్యర్ధులు పరిక్ష కేంద్రానికి వెళ్ళడానికి ఉచిత రైలు సౌకర్యం కలదు.
  • అప్లికేషను ఉపసంహరించుకోవడము కానీ దరఖాస్తు రుసుము వాపసు తీసుకోవడం జరగదు.
  • పరిక్ష తేదికి 7 రోజులకు ముందు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోగలరు.
  • పరిక్ష యందు అర్హత సాధించిన అభ్యర్ధికి దరఖాస్తు రుసుము నుండి తిరిగి కొంత డబ్బులు అభ్యర్ధి యొక్క బ్యాంకు అకౌంట్ జమ అవుతాయి.
  • నోటిఫికేషన్ కి సంబధించిన ఖాళీల వివరాలు, సిలబస్, మార్కుల వివరాలు, పరీక్షకు సంబధించిన వివరాలు, అప్లై చేసుకోను విధానం, రిజర్వేషన్ వివరాలు మరియు ఇతర పూర్తి వివరాలు క్రింద నోటిఫికేషన్ PDF రూపములో పొందుపరచడం జరిగింది పరిశీలించగలరు.