SSC Data Entry Operator and Lower Division Clerk Recruitment (డేటా ఎంట్రీ ఆపరేటర్ నోటిఫికేషన్)

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు లోయర్ డివిజన్ క్లార్క్/ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ 3712 ఖాళీల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు క్రింది నోటిఫికేషన్ వివరాలను పరిశీలించి అప్లై చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు

అప్లై చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 08-04-2024

చివరి తేది : 07-05-2024

దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది : 08-05-2024

అప్లికేషను ఫారంలోని తప్పిదాలను సరిచేసుకోవడానికి కేటాయించిన తేదీలు : 10-05-2024 నుండి 11-05-2024 వరకు

టైర్-1 (ఆన్లైన్ టెస్ట్) పరిక్ష తేది : జూన్ – జూలై 2024

టైర్-2 (ఆన్లైన్ టెస్ట్) పరిక్ష తేది : త్వరలో తేదిని విడుదల అవుతుంది.

విద్య అర్హతలు

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి ఇంటర్మీడియట్ (10+2) లేదా దానికి సమానమైన విద్య నందు తేది 01-08-2024 రోజు లోపుగా ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.  ఇంటర్ (10+2)లో కచ్చితంగా మాథెమాటిక్స్ సబ్జెక్టు ఉండవలెను.

వయసు నిబంధనలు

తేది 01-08-2024 రోజు వరకు అభ్యర్ధి యొక్క కనీస వయసు 18 సం”లు, గరిష్ట వయసు 27 సం”లు గా ఉండవలెను. తేది 02-08-1997 నుండి 01-08-2006 మధ్య కాలములో జన్మించిన అభ్యర్ధులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు.

వయసు సడలింపు వివరాలు

OBC అభ్యర్ధులకు 3 సం”లు, SC/ ST అభ్యర్ధులకు 5 సం”లు, PwBD జనరల్ అభ్యర్ధులకు 10 సం”లు, PwBD OBC అభ్యర్ధులకు 13 సం”లు, PwBD SC/ ST అభ్యర్ధులకు 15 సం”లు, మాజీ సైనికులకు 3 సం”లు, వితంతు/ విడాకులు పొందిన మహిళలకు జనరల్/ OBC అభ్యర్ధులకు గరిష్ట వయసు 35 సం”లు, అభ్యర్ధులకు గరిష్ట వయసు 40 సం”ల వరకు అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించడము జరిగింది.

దరఖాస్తు రుసుము వివరాలు

జనరల్/ OBC అభ్యర్ధులకు 100/- రూపాయల కలదు. SC/ ST/ PwBD/ మాజీ సైనికులు/ మహిళా అభ్యర్ధులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు. అప్లికేషను ఫారంలోని తప్పిదాలను మొదటి సరిచేసుకోవడానికి 200/- రూపాయలు, రెండవసారి తప్పిదాలను సరిచేసుకోవడానికి 500/- రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. కావున అభ్యర్ధులు అప్లికేషను సబ్మిట్ చేసేముందు తప్పిదాలు లేకుండా జాగ్రత్త పడగలరు.

ప్రతి ఉద్యోగ వివరాల తప్పనిసరిగా తెలుసుకోవడానికి క్రింద ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ లేదా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవడము ద్వారా మీరు జాబు నోటిఫికేషన్ విడుదల అయిన రోజున తెలుసుకోవడానికి ఆస్కారము ఉంది. కావున ఇందులో ఏదైనా ఛానల్ లో జాయిన్ కాగలరు. మేము మీకు ఈ చానల్స్ ద్వారా ప్రతి ఉద్యోగ సమాచారం తెలియ చేస్తాము.