UPSC Civil Services Recruitment 2024 (భారత సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్)

UPSC నుండి అత్యున్నతమైన పోస్టులు అయినటువంటి సివిల్ సర్వీస్ రిక్రూట్మెంట్ 1056 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. అర్హులు అయిన అభ్యర్ధులు క్రింద తెలియ చేసిన వివరాలను పరిశీలించి అప్లై చేసుకోగలరు.

దరఖాస్తు రుసుము

జనరల్/ OBC అభ్యర్ధులకు రూ” 100/- కలదు, SC/ ST/ PHw/ మహిళా అభ్యర్ధులకు ఎటువంటి పరీక్ష రుసుము లేదు. చెల్లింపులు ఆన్లైన్ పద్ధతి ద్వార మాత్రమే చెల్లించవలసి ఉంటుంది.

విద్య అర్హతలు

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా సమానమైన విద్య నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలను. యూనివర్సిటీ నుండి మాత్రమే డిగ్రీ సర్టిఫికేట్ పొంది ఉండవలెను. వేరే ఎటువంటి డిగ్రీ సర్టిఫికేట్ లు చెల్లుబాటు కావు అప్లై చేసుకోవడానికి అనర్హులు.

ముఖ్యమైన తేదీలు

అప్లికేషను చేసుకోవడానికి ప్రారంభ తేది : 14-02-2024

చివరి తేది : 05-03-2024

అప్లికేషనులోని మార్పులు చేర్పులకోసం తేదీలు : 06-03-2024 నుండి 12-03-2024 వరకు

ప్రిలిమినరీ పరిక్ష తేది : 26-05-2024

వయస్సు నిబందనలు

అభ్యర్ధి 01-08-2024 తేది నాటికీ తప్పనిసరిగా కనీస వయస్సు 21 సం”లు, గరిష్ట వయస్సు 32 సం”లు కలిగి ఉండవలెను. తేది 02-08-1994 నుండి 01-08-2003 మధ్య కాలములో జన్మించి ఉండవలెను.

వయస్సు సడలింపులు

SC/ ST అభ్యర్ధులకు 5 సం”లు, OBC/ EWS అభ్యర్ధులకు 3 సం”లు, అంగవైకల్యం కలిగిన అభ్యర్ధులకు సర్టిఫికేట్ స్థితిని బట్టి గరిష్టంగా 10 సం”లు,  సైన్యంలో పని చేసిన అభ్యర్ధులకు గరిష్టంగా 5 సం”లు వయస్సు సడలింపులు అదనంగా వర్తిస్తాయి.

ముఖ్యమైన విషయాలు

  • సిలబస్ కోసం క్రింద నోటిఫికేషన్ ను PDF రూపములో పొందుపరచాడము జరిగింది ఇందులో పూర్తి సిలబస్ మరియు ఇతర ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అప్లికేషను కి ముందు పరిశీలించగలరు.
  • ప్రిలిమ్స్ పరిక్ష మొత్తం మార్కులు 400 ఉంటాయి.
  • ఇట్టి రిక్రూట్మెంట్ కోసం రెండు దశల్లో పరీక్ష నిర్వహించబడుతుంది.
  • అప్లికేషను నందు తప్పు జరిగినచో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించడం జరిగింది.
  • అప్లై చేసిన అప్లికేషన్ మరల ఉపసంహరించుకోవడం లేదా రద్దు చేసుకోవడం ఉండదు.
  • తప్పుడు సమాధానాలకు పెనాల్టి మార్కులు కలవు.
  • కచ్చితంగా 10 రోజుల క్రితము ఫోటో మాత్రమే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫోటోలో గడ్డంతో ఉన్న వ్యక్తులు ప్రిలిమ్స్ లో అర్హత సాధిస్తే సెలక్షన్ ప్రాసెస్ అయ్యే వరకు అదే లుక్ లో ఉండవలసి ఉంటుంది.
  • ప్రిలిమ్స్ పరీక్షకేంద్రాలు హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ తెలుగు ప్రాంతాలకు చెందినవి మాత్రమే తెలియచెయ్యడం జరిగింది.
  • పోలీస్ రిక్రూట్మెంట్ కావున అభ్యర్ధి భారత పౌరసత్వం కలిగి ఉండవలెను.
  • కొన్ని పోస్టులకు అభ్యర్ధులకు మెడికల్ మరియు ఫిజికల్ టెస్ట్ లు ఉంటాయి కావున ఫిట్నెస్ గా ఉండవలసి ఉంటుంది.
  • మార్పులు చేర్పులకోసం అప్లికేషను సమయము పూర్తి అయిన తరువాత 7 రోజుల వరకు సమయము ఉంటుంది.
  • రిజర్వేషన్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.