SSC Staff Selection Recruitment (SSC సెక్షన్ పోస్టుల నోటిఫికేషన్)

SSC నుండి సెలక్షన్ 2049 పోస్టుల ఖాళీల భర్తికోసం నోటిఫికేషన్ విడుదల అయినది. ఈ పోస్టులో చాల క్యాటగిరిలలో పోస్టులు విడుదల అయినవి కావున పోస్టును అభ్యర్ధి యొక్క విద్య అర్హత మరియు ఆసక్తిని బట్టి జాగ్రతగా ఎంచుకోగలరు. అభ్యర్ధులు క్రింద తెలియజేసిన వివరాలను పరిశీలించి అప్లై చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు

అప్లై చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 26-02-2024

చివరి తేది : 18-03-2024

దరఖాస్తు రుసుము చెల్లించుటకు చివరి తేది : 19-03-2024

అప్లికేషనులోని తప్పులను సరి చేసుకొనుటకు తేదీలు : 22-03-2024 నుండి 24-03-2024 వరకు

కంప్యూటర్ ఆధారిత పరిక్ష (ఆన్లైన్ టెస్ట్) అంచనా తేది మాత్రమే : 06-05-2024 నుండి 08-05-2024 వరకు

దరఖాస్తు రుసుము

OC/ OBC అభ్యర్ధులకు రూ 100/- లు కలదు. SC/ ST/ PwBD/ మాజీ-సైనికులు/ మహిళా అభ్యర్ధులకు ఎటువంటి పరిక్ష రుసుము లేదు. సైనిక కుటుంబానికి చెందిన కుమారుడు లేదా కుమార్తెకు దరఖాస్తు రుసుములో మినహాయిము ఉండదు.

విద్య అర్హతలు

ఈ నోటిఫికేషన్ నందు చాల క్యాటగిరిలలో పోస్టులు విడుదల అయ్యాయి కావున 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో పోస్టులు విడుదల అయినవి. పభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ బోర్డు నుండి ఉతిర్ణత సాధించి ఉండవలను. పోస్టు వివరాలు మరియు రిజర్వేషన్ ఆధారంగా ఉన్న పోస్టులు మొత్తం వివరాలు క్రింద నోటిఫికేషన్ PDF లో పొందుపరచడం జరిగింది పరిశీలించగలరు.

వయస్సు నిబంధనలు

అభ్యర్ధిలు తేది 01-01-2024 వరకు వారి యొక్క కనీస వయస్సు 18 సం”లు, గరిష్ట వయస్సు 42 సం”లు వరకు ఉండవలను. పోస్టు క్యాటగిరిని బట్టి వయస్సు నిబంధనలు వేరే, వేరుగా ఉన్నవి కావున పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో తెలియజెయ్యడం అయినది.

వయస్సు సడలింపు వివరాలు

SC/ ST అభ్యర్ధులకు 5 సం”లు, OBC అభ్యర్ధులకు 3 సం”లు జనరల్ PwBD అభ్యర్ధులకు 10 సం”లు,  OBC PwBD అభ్యర్ధులకు 13 సం”లు, SC/ ST PwBD అభ్యర్ధులకు 15 సం”లు, మాజీ-సైనికులకి 3 సం”లు ఉద్యోగము నందు గాయపడిన సైనికుడి కుటుంబ సభ్యలకు 8 సం”ల వరకు వయసు నిబంధనలు వర్తిస్తాయి.

ముఖ్యమైన విషయాలు

  • ఒక్క అభ్యర్ధి ఎన్ని పోస్టులకు అయిన అప్లై చేసుకోవచ్చు. వేరు క్యాటగిరిలలో పోస్టులకు అప్లై చేసుకోవాలని అనుకునే అభ్యర్ధులు తమ యొక్క దరఖాస్తులను వేరు, వేరుగా సమర్పించవలసి ఉంటుంది.
  • అప్లై చేసుకోవడానికి ఆసక్తి గలవారు చివరి తేది కంటే వారము రోజులకు ముందుగానే చేసుకోవడానికి ప్రయత్నించండి. చివరి రోజుల్లో అభ్యర్ధుల యొక్క లాగిన్ లు అక్కువ అవడము వలన SSC సర్వర్లు స్లో లేదా పని చెయ్యకపోవడం వలన అప్లై చేసుకోవడములో అంతరాలను అదుర్కొనవచ్చు.
  • అప్లై చేసుకొన్నా తరువాత తమయొక్క అప్లికేషను ప్రింట్ తిసి జాగ్రత్త పరుచుకోగలరు.
  • అప్లికేషనులోని తప్పులను సరి చేయుటకు మొదటిసారి 200/- రూపాయలు, మరల రెండవసారి కూడా తప్పులను సరి చేయాలనీ బావిస్తే 500/- రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
  • పరిక్ష కేంద్రాలు హైదరాబాద్, కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కడప, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, కరీంనగర్, వరంగల్ తెలుగు ప్రాంతాలకు చెందినవి మాత్రమే ఇక్కడ తెలియజేయడం జరిగినది.
  • పరిక్ష తేదికి వారము రోజులకు ముందు అడ్మిట్ కార్డు ప్రింట్ తీసుకోగలరు. పరిక్ష సమయములో ప్రభుత్వం పాస్ ఫోటోతో జారీచేసిన అదైన ID కార్డు తమ వెంట తీసుకేల్లవలసి ఉంటుంది.
  • అప్లికేషను ఫారం నందు అప్లోడ్ చేసిన ఫోటో లో మీరు ఎలా ఉన్నరో పరిక్షకి హాజరు అవ్వు సమయములో కూడా అదేవిధంగా ఉండవలెను. ఫోటోలో గడ్డం కలిగి ఉంటె పరిక్ష సమయములో కూడా అదే లుక్ తో ఉండవలసి ఉంటుంది.
  • సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయములో సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండవలసి ఉంటుంది. ఏదైనా ఒరిజినల్ సర్టిఫికేట్ లేని యెడల అభ్యర్ధిని రిజెక్ట్ చేసే అవకాశము ఉన్నది. అవసరం అయిన సర్టిఫికేట్ వివరాలను నోటిఫికేషన్ లో తెలియ చెయ్యడం జరిగింది.