Telangana TSPSC Group 1 (తెలంగాణ గ్రూప్ 1)

తెలంగాణ ప్రభుత్వ TSPSC నుండి గ్రూప్ 1 పోస్టులు రిక్రూట్మెంట్ కోసం 563 ఖాళీలను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ విడుదల అయినది. క్రింద తెలియచేసిన అర్హత వివరాలను పరిశీలించి అప్లై చేసుకోగలరు.

ఖాళీల వివరాలు

  1. డిప్యూటీ కలెక్టర్ : 45
  2. డిప్యూటీ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ : 115
  3. కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ : 48
  4. రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ : 04
  5. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ : 07
  6. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రరర్ : 06
  7. డిప్యూటీ సూపరింటెండెంట్ అఫ్ జైల్స్ : 05
  8. అసిస్టెంట్ కమిషనర్ అఫ్ లేబర్ : 08
  9. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ : 30
  10. మున్సిపల్ కమిషనర్ : 41
  11. డిస్ట్రిక్ట్ సోషల్ వేల్ఫిర్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ షెడ్యుల్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ : 03
  1. డిస్ట్రిక్ట్ బ్యాక్వార్డ్ క్లాస్ వేల్ఫైర్ ఆఫీసర్ : 05
  2. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వేల్ఫైర్ ఆఫీసర్ : 02
  3. డిస్ట్రిక్ట్ ఎప్మోయ్మేంట్ ఆఫీసర్ : 05
  4. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ : 20
  5. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ / అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ : 38
  6. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ : 41
  7. మండల పరిషత్ డెవెలప్మెంట్ ఆఫీసర్ : 140

మొత్తం ఖాళీలు : 563

ముఖ్యమైన తేదీలు

అప్లై చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 23-02-2024

చివరి తేది : 14-03-2024

అప్లికేషనులోని తప్పిదాలను సరిచేసుకోవడానికి తేదీలు : 23-03-2024 నుండి 27-03-2024 వరకు

హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోను తేది : పరిక్ష తేదికి 7 రోజుల ముందు నుండి

ప్రిలిమ్స్ పరిక్ష తేది : మే/ జూన్  2024

ప్రధాన పరిక్ష తేది : సెప్టెంబర్/ అక్టోబర్ 2024

విద్య అర్హతలు

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా సమానమైన విద్య నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను. (నోటిఫికేషన్ విడుదల కంటే ముందు అనగా తేది 19-02-2024 రోజు వరకే ఉత్తిర్ణత అయ్యి ఉండవలెను)

వయస్సు నిబంధనలు

01-07-2024 తేది నాటికి కనీస వయస్సు 18 సం”లు, గరిష్ట వయస్సు 46 సం”లుగా ఉండవలెను. పోస్టు ఆధారంగా కనిష్ట వయస్సు మరియు గరిష్ట వయస్సులు మారుతాయి కావున నోటిఫికేషన్ PDF రూపములో క్రింద పొందు పరచడము జరిగింది పూర్తి వివరాల కోసం పరిశీలించగలరు.

వయసు సడలింపు వివరాలు

తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయు వారికీ 5 సం”లు, మాజీ-సైనుకులకు 3 సం”లు, NCC లో పనిచేసిన వారికీ 3 సం”లు, SC/ ST/ OBC/ EWS లకు 5 సం”లు, PwBD అభ్యర్ధులకు 10 సం”ల వయస్సు సడలింపులు వర్తిస్తాయి.

పరిక్ష రుసుము : అన్ని వర్గాల అభ్యర్ధులకు 120/- రూపాయలు కలదు.

బౌతిక ప్రమాణాలు

(పోస్టు నెం. 2 మరియు 9 ల కోసం) పురుషులు : ఎత్తు 165 సెం.మీ. కంటే తక్కువ ఉండకుడదు. ఛాతి విస్తీర్ణం 86.3 సెం.మీ పైగా ఉండాలి. శ్వాస తీసుకున్నపుడు 5 సెం.మీ విస్తరించాలి. మహిళలు : ఎత్తు 150 సెం.మీ. కంటే తక్కువ ఉండకుడదు. బరువు 45.5 కిలోల కంటే తక్కువ ఉండకుడదు. ప్రభుత్వ వైద్యుడి నుండి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.

TSPSC గ్రూప్ 1 సిలబస్ : Click Here