Central Bank of India Apprentice notification (సెంట్రల్ బ్యాంకు అప్రెంటిస్ శిక్షణ కోసం)

సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా నుండి అప్రెంటిస్ 3000 ఖాళీల భర్తి కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. కావున అర్హులు అయ్యాన అభ్యర్ధులు క్రింద తెలియ చేసిన వివరాలను మరియు అర్హతలను తెలుసుకొని అప్లై చేసుకోగలరు.

ఖాళీల వివరాలు

  1. ఆంధ్రప్రదేశ్ : 100
  2. తెలంగాణ : 96
  3. అండమాన్ అండ్ నికోబార్ : 1
  4. అరుణాచల్ ప్రదేశ్ : 10
  5. అస్సాం : 70
  6. బీహార్ : 210
  7. చండీగఢ్ : 11
  8. ఛత్తీస్‌గఢ్ : 76
  9. దాద్రా అండ్ హవేలీ : 3
  10. ఢిల్లీ : 90
  11. గోవా : 30
  12. గుజరాత్ : 270
  13. హర్యానా : 95
  14. హిమాచల్ ప్రదేశ్ : 26
  15. జమ్ము అండ్ కాశ్మీర్ : 8
  16. ఝార్ఖండ్ : 60
  17. కర్ణాటక : 110
  18. కేరళ : 87
  19. లడఖ్ : 2
  20. మధ్య ప్రదేశ్ : 300
  21. మహారాష్ట్ర : 320
  22. మణిపూర్ : 8
  23. మేఘాలయ : 5
  24. మిజోరాం : 3
  25. నాగాలాండ్ : 8
  26. ఒర్రిస్సా : 80
  27. పుడుచేర్రి : 3
  28. పంజాబ్ 115
  29. రాజస్థాన్ : 105
  30. సిక్కిం : 20
  31. తమిళనాడు : 142
  32. త్రిపుర : 7
  33. ఉత్తరప్రదేశ్ : 305
  34. ఉత్తరఖండ్ : 30
  35. వెస్ట్ బెంగాల్ : 194

మొత్తం పోస్టులు : 3000

ముఖ్యమైన తేదిలు

అప్లికేషను చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 21-02-2024

చివరి తేది : 06-03-2024

ఆన్లైన్ పరీక్ష తేది (అంచనా తేది మాత్రమే) : 10-03-2024

విద్య అర్హతలు

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా డిగ్రీ కి సమానమైన విద్య నందు ఉత్తిర్నత సాధించి ఉండవలెను. తేది 31-03-2020 రోజు తరువాత డిగ్రీ పట్టా పొందిన అభ్యర్ధులు మాత్రమే ఈ నోటిఫికేషన్ కి అర్హులు. కావున ఇట్టి తేది కంటే ముందు ఉత్తిర్ణత సాధించిన అభ్యార్ధులు అప్లై చేసుకోకూడదు.

దరఖాస్తు రుసుము

  • PwBD అభ్యార్ధులకు రూ”లు 400/- + GST
  • SC/ST అభ్యార్ధులకు రూ”లు 600/- + GST
  • ఇతర అభ్యార్ధులకు రూ”లు 800/- + GST

వయస్సు నిబంధనలు

కనీస వయస్సు 24 సం”లు, గరిష్ట వయస్సు 30 సం”లు కలిగి ఉండవలెను. (అభ్యర్ధులు తేది 01-04-1996 నుండి 31-03-2004 మధ్య కాలములో జన్మించి ఉండవలెను)

వయస్సు సడలింపు వివరాలు

SC/ ST అభ్యార్ధులకు 5 సం”లు, OBC అభ్యార్ధులకు 3 సం”లు, అంగవైకల్యం కలిగిన అభ్యార్ధులకు 10 సం”లు, 1984 సం”లో అల్లర్లలో ప్రభావితం అయిన కుటుంబాలకు చెందినా వారికీ 5 సం”లు, వితంతు లేదా విడాకులు తీసుకున్న మహిళలకు గరిష్ట వయస్సు జనరల్/EWS అభ్యార్ధులకు 35 సం”లు, OBC అభ్యార్ధులకు 38 సం”లు మరియు SC/ ST అభ్యార్ధులకు 40 సం”లు వయస్సు వరకు అప్లై చేసుకొనే వెసులుబాటు కలిగి ఉంటారు (మరల వివాహము చేసుకున్న వారు ఇట్టి వయస్సు సడలింపులు వర్తించవు).

ముఖ్యమైన విషయాలు

  • అప్రెంటిస్ శిక్షణ 12 నెలల కాలము వరకు ఉంటుంది.
  • ఆరోగ్యము బాగున్నట్లుగా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండవలెను.
  • అప్లై చేసుకోను ప్రాంత స్థానిక భాష వచ్చి ఉండవలెను.
  • అప్లై చేసుకోను సమయములో అప్రెంటిస్ కోసం ఒకే ఒక్క ప్రాంతాన్ని ఎంచుకోవలసి ఉంటుంది.
  • అప్రెంటిస్ గా చేయు సమయములో స్టైఫాండ్ గా 15,000/- రూ” ఇవ్వడము జరుగుతుంది.
  • రిజర్వేషన్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారము వర్తిస్తుంది.
  • దరఖాస్తును ఉపసంహరించుకోవడం లేదా దరఖాస్తు రుసుము వపస్సు ఇవ్వడం జరగదు.
  • అప్రెంటిస్ పూర్తి అయిన తరువాత బ్యాంకులో ఉద్యోగ హామీ లభించదు.
  • తప్పుడు ధృవపత్రాలతో అప్లై చేసుకున్న అభ్యర్ధులకు తగిన శిక్షకు అర్హులు.
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబడుతుంది.(ఆన్లైన్ టెస్ట్)