UPSC Indian Forest Service Recruitment (భారతీయ అటవీశాఖ)

భారతీయ అటవీశాఖ నుండి 150 ఖాళీల భర్తీ కోసం UPSC నుండి నోటిఫికేషన్ విడుదల అయింది. పూర్తి వివరాలను క్రింద తెలియచేసిన ప్రకారంగా అర్హులు అయిన అభ్యర్ధులు అప్లై చేసుకోగలరు. ఇందుకోసం ముందుగా OTR (వన్ టైం రిజిస్ట్రేషన్) చేసుకోవాలి. ఒక్క వ్యక్తి ఒక్క OTR మాత్రమే నమోదు చేసుకోగలరు. కావున ఏమైనా తప్పులు ఉన్నచో సవరించుకొని దానినే కొనసాగించగలరు.

ముఖ్యమైన తేదీలు

  • అప్లై చేసుకోవడానికి ప్రారంభమైన తేది : 14-05-2024
  • చివరి తేది: 05-03-2024
  • అప్లికేషను ఫారం నందు తప్పులు జరిగినచో సరిచేయుటకు కేటాయించిన తేదీలు : 06-03-2024 నుండి 12-03-2024 వరకు.
  • ప్రిలిమినరీ పరీక్ష తేది : 26-05-2024.

దరఖాస్తు రుసుము

OC/EWS/OBC అభ్యార్ధులకు రూ” 100/- కలదు. SC/ST/PWBD/ మహిళా అభ్యార్ధులకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు. ఇట్టి రుసుమును ఆన్లైన్ పద్ధతి ద్వారా మాత్రమే చెల్లించాలి.

వయస్సు నిబంధనలు (01-08-2024 తేది నాటికీ)

  • కనీస వయస్సు : 21 సం”లు
  • గరిష్ట వయస్సు : 32 సం”లు
  • అభ్యర్ధులు కచ్చితంగా తేది : 02-08-1992 నుండి 01-08-2023 మధ్య కాలములో జన్మించిన వారు మాత్రమే అర్హులు.

వయస్సు సడలింపు వివరాలు

ST/SC అభ్యార్ధులకు 5 సంవత్సరాలు, OBC అభ్యార్ధులకు 3 సంవత్సరాలు, అంగవైకల్యం కలిగిన అభ్యార్ధులకు 3 సంవత్సరాలు, సైన్యములో పని చేయు సమయములో గాయపడిన వారిని 5 సంవత్సరాలు వయస్సు సడలింపులు వర్తిస్తాయి.

విద్య అర్హతలు

ప్రభుత్వ గుర్తింపు పొంచిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా దానికి సామిన విద్య నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను. అప్లై చేసుకోవడానికి ఎటువంటి మార్కుల పరిమితులు లేవు. నోటిఫికేషన్ విడుదల అయ్యే తేది వరకు ఉత్తిర్ణత అయ్యి ఉంటె సరిపోతుంది.

పరీక్ష కేంద్రాలు

తెలుగు ప్రాంతాలకు చెందిన కేద్రాలు మాత్రమే తెలియ చేయడము జరుగుతుంది. హైదరాబాద్, అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం మరియు వరంగల్.

ముఖ్యమైన విషయాలు

  • మొత్తం ఖాళీలు 150
  • ఇట్టి పరీక్ష నందు తప్పుడు సమాధానాలకు పెనాల్టి మార్కులు కలవు
  • అప్లై చేసుటకు ఫోటో మరియు సంతకము సరిగా కనిపించేలా ఉండాలి. గడ్డం కలిగిన పొటోలు, సేల్ఫీ ఫోటోలు అప్లోడ్ చేయకూడదు.
  • 10 రోజుల క్రితము తీసిన ఫోటో మాత్రమే అయ్యి ఉండాలి.
  • తప్పుడు ధ్రువ పత్రాలతో అప్లై చేసుకున్న అభ్యర్ధి అప్లికేషన్ తొలగించే అవకాశము ఉంది.
  • రెండు దశలలో పరిక్షలు నిర్వహించబడును.
  • పరీక్ష తేదికి వారము రోజులకు ముందు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోగలరు.
  • అప్లై చేసుకున్న తరువాత తమ యొక్క అప్లికేషను ఫారంను ఉపసంహరించుకోవడం జరగదు.
  • అంగవైకల్యం కలిగిన అభ్యార్ధులు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారము ఉంటె మాత్రమే రిజర్వేషన్ కు అర్హులు.
  • బౌతిక ప్రమాణాలు అవసరము లేదు.
  • పరీక్ష కేంద్రానికి సెల్ ఫోన్ మరియు ఎలక్ట్రిక్ వస్తువులు నిషేధం.
  • ప్రతి విషయము మెయిల్ ద్వారా సమాచారము తెలియ చెయ్యబడుతుంది.
  • మరిన్ని పూర్తి వివరాలను క్రింద PDF రూపములో నోటిఫికేషన్ ను పొంచుపరచడం జరిగింది జాగ్రతగా పరిశీలించగలరు.