CRPF Meritorious Sportsperson (CRPF స్పోర్ట్స్ పర్సన్ నోటిఫికేషన్)

CRPF లో స్పోర్ట్స్ కోటా 2024 కింద కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్ట్ కోసం ప్రతిభావంతులైన క్రీడాకారుల రిక్రూట్ మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. సెంట్రల్ లో తాత్కాలిక ప్రాతిపదికన గ్రూప్ సి లో కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) నాన్ గెజిటెడ్ & నాన్ మినిస్టిరియల్ పోస్టుల కోసం 169 ఖాళీలు భర్తీకి  అర్హులైన భారతీయ పౌరుల నుండి(పురుషులు & స్త్రీల నుండి) దరఖాస్తులు ఆహ్వానిన్చాబడ్డాయి.

పోస్టులకు మొత్తం భారత దేశ భాద్యత ఉంటుంది. ఎంపిక చేసిన అభ్యర్థులను భారతదేశంలో మరియు విదేశాలలో ఎక్కడైనా పోస్ట్ చేయవచ్చు. నియామకంపై అభ్యర్థులు CRPF చట్టం 1949 మరియు 1955 ద్వారా నియంత్రించబడుతారు. అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే అమోదించబడుతాయి.

మొత్తం ఖాళీలు : 169

వయస్సు నిబంధనలు : 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

వయస్సు సడలింపు వివరాలు

గరిష్ట వయో పరిమితి అన్రిజేర్వేడ్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు(అదనపు 5 సంవత్సరాలు అంటే 5+5=10 సంవత్సరాలు) SC/ST మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు 5+3=8 సంవత్సరాలు వయస్సు సడలింపు వర్తిస్తుంది.

మూడు సంవత్సరాల నిరంతర సర్వీసు ఉన్న డిపార్ట్మెంటల్ గరిష్ట వయోపరిమితి సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.మరియు షెడ్యుల్ కులాలు లేదా షెడ్యుల్ తెగలకు 5 సంవత్సరాలు ఇతర వెనుక బడిన తరగతులకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు సమర్పించిన తేదిలలో అందుబాటులో ఉన్న మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్ (SSC) లో నమోదు చేయబడిన పుట్టిన తేది మాత్రమే వయస్సు నిర్ణయించడానికి అంగీకరించబడుతుంది.

పరీక్ష రుసుము

జనరల్ అభ్యర్థులకు, అన్ రిజర్వేడ్, OBC మరియు EWS వర్గానికి చెందిన పురుష అభ్యర్థులు స్పోర్ట్స్ కోటా కింద GD ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారికీ రూ”  100/- ఉంటుంది. షెడ్యూల్ కులం(SC) షెడ్యుల్ తెగ (ST), మరియు  మహిళలు అభ్యర్థులకు పరీక్ష రుసుము మినహాయింపు వర్తిస్తుంది.

విద్య అర్హతలు

గుర్తింపు పొందిన బోర్డ్ నుండి మెట్రిక్యులేషన్ నుండి లేదా దానికి సమానమైన విద్య నుండి ఉత్హిర్ణత సాధించి ఉండవలెను.

క్రీడ అర్హతలు

గత మూడు సంవత్సరాలలో 01/01/2021  నుండి 31/12/2023 వరకు ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ ద్వారా

యూత్ అఫైర్స్ & స్పోర్ట్స్ మత్రిత్వ శాఖా ద్వారా నిర్వించబడిన ఏదైనా గుర్తింపు పొందిన జాతీయ ప్రతిభ కలిగిన క్రీడ కలిగి ఉండాలి. గత మూడు సంవత్సరాలలో అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ AIU నిర్వయించిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంటులో వారి విశ్వవిద్యాలాయానికి ప్రాతినిద్యం వహించిన ప్రతిభ గల క్రీడాకారుడు అయి ఉండాలి.

గత మూడు సంవత్సరాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వయించిన నేషనల్ స్కూల్ గేమ్స్ ప్రాతినిధ్యం వహించిన క్రీడ కారులై ఉండాలి.

ఫిసికల్ స్టాండర్డ్స్ (బౌతిక ప్రమాణాలు)

జనరల్ అభ్యర్థులు:

పురుషులు: 170 సెం.మీ  ఎత్తు కలిగి ఉండాలి.

స్త్రీలు: 150 సెం .మీ ఎత్తు కలిగి ఉండాలి.

చాతి: 80 సెం.మీ పురుషులకు ఉండాలి.

కొండ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు అనగా అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకాశ్మీర్ ప్రాంతానికి చెందిన అభ్యర్థులకు క్రింది విధంగా బౌతిక ప్రమాణాలు వర్తిస్తాయి.

పురుషులు: 165 సెం. మీ ఎత్తు కలిగి ఉండాలి.

స్త్రీలు: 155 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి.

చాతి: 78 సెం.మీ (పురుషులకు)

ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్,మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు క్రింది విధంగా బౌతిక ప్రమాణాలు వర్తిస్తాయి.

పురుషులు:162.5 సెం.మీ  ఎత్తు కలిగి ఉండాలి.

స్త్రీలు: 152 .5 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి.

చాతి: 77 సెం.మీ (పురుషులకు)

షెడ్యుల్ తెగలకు చెందిన అభ్యర్థులు:

పురుషులు: 162.5 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి.

స్త్రీలు: 150 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి.

షెడ్యుల్ తెగలకు చెందిన అభ్యర్థులందరు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు;

పురుషులు: 157సెం. మీ ఎత్తు కలిగి ఉండాలి.

చాతి: పురుషులకు శ్వాస పిల్చినప్పుడు 5 సెం.మీ విస్తరించి ఉండాలి.

వైద్య ప్రమాణాలు

అభ్యర్థుల మెడికల్ ఎగ్జామినేషన్ CAPF లలో GO లు మరియు NGOల కొరకు మెడికల్ రిక్రూట్మెంట్ నిర్వయించ బడుతుంది. కంటి చూపు రెండు కళ్ళకు కనిష్ట దూర దృష్టి 6/6 మరియు 6/9 ఉండాలి.

పచ్చబొట్టు : మన దేశస్థుల మతపరమైన చిహ్నాలు, పచ్చబొట్లు  లేదా పేర్లు మాత్రమే అనుమతించబడుతాయి.