APPSC Junior Lecturer Notification (AP జూనియర్ లెక్చరర్)

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. కమిషన్ వెబ్ సైట్ ద్వారా అర్హులైన అభ్యర్థుల నుండి మొత్తం 47 క్యారీ ఫార్వార్డ్ ఖాళీల కోసం A.P ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిన్చాబడ్డాయి ఆసక్తి గల అభ్యర్ధులు క్రింద తెలియచేసిన వివరాలను జాగ్రతగా పరిశీలించి అప్లై చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ప్రారంభ తేది: 31/01/2024

అప్లికేషన్ చివరి తేది: 20/02/2024

దరఖాస్తు రుసుము

OC (జనరల్) అభ్యర్ధులకు రూ” 370/-, SC/ ST/ BC/ PWD/ మాజీ సైనికులకు అభ్యర్ధులకు రూ” 250/-, అప్లికేషను ఫోరం నందు తప్పులు సరిచేయుటకు రూ” 100/- చెల్లింపు విధానం ఆన్లైన్ పద్ధతిని ద్వారా మాత్రమే చెల్లించాలి.

వయస్సు నిబంధనలు : కనీస వయస్సు 18 సం” నుండి 42 సం”ల మధ్య వయస్సు కలిగి ఉండవలెను. వయస్సు సడలింపులు ప్రభుత్వ నిబంధనల ప్రకారము వర్తిస్తుంది.

అర్హత గల అభ్యర్థులు ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ యొక్క నిభందనలు షరతుల ప్రకారం సంతృప్తి చెందిన తర్వాత ఆన్లైన్ లో దరఖాస్తూ చేసుకోవాలి.నిర్దేశించిన ఆన్లైన్ మోడ్ లో కాకుండా మరే ఇతర మోడ్ ద్వారా పంపబడిన అప్లికేషన్ ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించబడదు. కమిషన్ నిర్వహించే కంప్యుటర్ బెస్ట్ రిక్రూట్ మెంట్ టెస్ట్ మోడ్ లో వ్రాత పరీక్షా ఆధారంగా పోస్టుకు ఎంపిక చేయబడుతుంది.వ్రాత పరీక్షా ఏప్రిల్/మే 2024 నెలలో జరుగుతుంది. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా,అభ్యర్థులు కంప్యూటర్ ప్రోఫిషియేన్సీ టెస్ట్(CPT) కోసం ఎంపిక చేయబడుతారు. (CPT)లో అర్హత పొందితే తప్ప ఏఅభ్యర్థి అపాయింట్మెంట్ కు అర్హులు కాదు. అభ్యర్థి ఈ నోటిఫికేషన్లో 28/12/2023 తేదీన నిర్దేశించిన విద్య అర్హతలను కలిగి ఉండాలి. రాత పరీక్షా మరియు కంప్యూటర్ ప్రోఫిషియేన్సీ టెస్ట్ (CPT) కోసం స్కీం మరియు సిలబస్ వివరాలు ఈ నోటిఫికేషన్ తో జత చేయబడ్డాయి.

ఖాళీల విభజన, వేతన స్కేల్, వయస్సు, సంఘం, విద్య అర్హతలు మరియు సూచనలతో కూడిన ఇతర సమాచారం 31/01/2024 తేది లోపు కమిషన్ వెబ్ సైట్ లోhttps://appsc.ap.gov.in లో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుకు సంబంధించిన అన్ని అంశాలలో కమిషన్ యొక్క ఫైనల్ నిర్ణయం ఉంటుంది. మరియు అభ్యర్థి యొక్క ఎంపిక, పరీక్షా నిర్వహణపై భారత రాజ్యాగంలోని ఆర్టికల్ 315 నుండి 320 వరకు దానికి సక్రమించిన అధికారాల ప్రకారం కమిషన్ నిర్ణయం ఉంటుంది.

వ్రాత పరీక్ష

పేపర్ 1: జనరల్ స్టడీస్& మెంటల్ ఎబిలిటీ డిగ్రీ అర్హత నుండి:

ప్రశ్నల సంఖ్యా: 150

పరీక్షా సమయం: 150 నిమిషాలు.

గరిష్ట మార్కులు: 150

పేపర్ 2:PG విద్య నుండి:

ప్రశ్నల సంఖ్య: 150

పరిక్ష సమయం: 150 నిమిషాలు.

గరిష్ట మార్కులు: 300

మొత్తం మార్కులు: 450

కంప్యూటర్ ప్రావిణ్యత పరీక్ష(CPT)పరిక్ష యొక్క పథకం& సిలబస్.

పరిక్ష పథకం

కంప్యూటర్ మరియు అసోసియేటెడ్ సాఫ్ట్ వేర్ వినియోగం తో ఆఫీస్ ఆటోమేషన్లో నైపుణ్యం కలిగి ఉండాలి.

పరిక్ష సమయం:60 నిమిషాలు.

గరిష్ట మార్కులు: 100.

కనీస మార్కుల అర్హత:

SC/ST/PH అభ్యర్థులకు: 30 మార్కులు.

BC అభ్యర్థులకు: 35 మార్కులు.

OC అభ్యర్థులకు: 40 మార్కులు.

మరిన్ని వివరాలకోసం క్రింద PDF లో పూర్తి నోటిఫికేషన్ పొందుపరచాడము జరిగింది పరిశీలించగలరు.