TSRTC Graduate Apprenticeship (TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటిస్)

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నుండి అప్రెంటిస్ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. B.COM, B.SC, B.A, BBA మరియు BCA గ్రాడ్యుయేట్అభ్యర్థుల నుండి TSRTC లో నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్ధుల కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. ఆసక్తి గల అభ్యర్ధులు క్రింద తెలియజేసిన వివరాలను పూర్తిగా చదివి అర్హులు అయిన వారు అప్లై చేసుకోగలరు.

ఖాళీల వివరాలు

హైదరాబాదు : 26

సికేంద్రాబాద్ : 18

మహబూబ్ నగర్ : 14

మెదక్ : 12

నల్గొండ : 12

రంగారెడ్డి : 12

ఆదిలాబాద్ : 9

కరీంనగర్ : 15

ఖమ్మం : 9

నిజామబాద్ : 9

వరంగల్ : 14

మొత్తం ఖాళీలు  : 150

అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ : 16-02-2024

రిజర్వేషన్ అఫ్ ట్రైనింగ్ ప్లేసెస్

శిక్షణ స్థలాలు షెడ్యుల్ కు చెందిన అప్రెంటిస్ నిష్పత్తి ప్రకారం ప్రతి ట్రేడ్ లో షెడ్యుల్ కులాలు  లేదా షెడ్యుల్ తెగలకు సంబంధించిన వ్యక్తులు భర్తీ చేయవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెనుకబడిన తరగతులకు 25% రిజర్వేషన్ వర్తిస్తుంది.

విద్య అర్హతలు

B.COM, B.SC, B.A, BBA మరియు BCA విద్య అర్హత కలిగిన అభ్యర్థులు TSRTC లో నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. BBA అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 2018, 2019, 2020, 2021, 2022, 2023 గ్రాడ్యుయేట్ పరీక్షలో ఉత్హిర్నులైన అభ్యర్థులు మాత్రమే NATS లో నమోదు చేసుకోవడానికి అర్హులు. PHC (దివ్యంగులు) అభ్యర్థులకు ఫై పోస్ట్ అప్లై చేసుకోవడానికి అర్హత లేదు.

రూ. 15,000/-, రూ. 16,000/- మరియు రూ. 17,000/- వరుసగా 1, 2 & 3 సంవత్సరాలకు అప్రెంటిస్ షిప్ వ్యవధిలో సస్పెండ్ లో నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లకు చెల్లించబడుతుంది.

ఎంపిక విధానం

NATS నుండి అభ్యర్థుల జాబితాను స్వీకరించి ప్రాధమిక నిర్దేశిత అర్హతలో పొందిన మార్కుల CGPA / శాతం ఆధారంగా అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్ చేయబడుతుంది. అభ్యర్థుల జాబితా రాని పక్షంలో, ఇంజనీరింగ్ కానీ గ్రాడ్యుయేట్లను ఎంపిక చేయడానికి ప్రాంతీయ కార్యాలయంలో మేళా నిర్వహించబడుతుంది. ఎంపిక ప్రక్రియ తర్వాత షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థుల జాబితా కార్పోరేట్ కార్యాలయానికి పంపించబడుతుంది.ఎంపికైన అభ్యర్థులు సంబంధిత డిపోలలో పోస్టింగ్ కోసం తెలియజేయబడుతారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హాజరయ్యే అభ్యర్థులకు TA / DA చెల్లించబడదు. ఎంపికైన అభ్యర్థులు వెరిఫికేషన్ కోసం అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ సమర్పించాలి. సంబందిత ప్రాంతంలో 3 డిపోల ఎంపికను ప్రతి అభ్యర్థి నుండి కమిటి అంగీకరించాలి. అప్రెంటిస్ శిక్షణ కాలం మొత్తం 3 సంవత్సరాల పాటు ఉంటుంది.

లోకల్ అభ్యర్థుల రిజర్వేషన్:

స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్లు నిబంధనలో అందించిన విధంగా మరియు నోటిఫికేషన్ తేదిలో అమలులో ఉన్న కాలానుగుణంగా సవరించబడిన రూపంలో వర్తిస్తుంది. ఏ దశలోనైన నోటిఫికేషన్ ప్రక్రియను రద్దు చేసే హక్కు కార్పొరేషన్ కు ఉంది. TSRTC యొక్క డిపోలలో శిక్షణ పొందుతున్న అప్రెంటిస్ల అందరికి నివాస స్థలం నుండి డిపోకు ప్రయాణించడానికి అప్రెంటిస్ ID కార్డ్ జారీ చేయబడుతుంది మరియు నగర సాధారణ, ఉప పట్టణ జిల్లా సాధారణ సేవల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించవచ్చు. అప్రెంటిస్ ల ప్రవర్తన మరియు క్రమశిక్షణ మరియు భద్రతకు సంబందించిన అన్ని విషయాలలో స్థాపన యొక్క నియమాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండాలి మరియు స్థాపనలో ఉన్నత అధికారులు చట్టపరమైన ఆదేశాలను అమలు చేస్తారు. ఏదైనా తప్పుగా ప్రవర్తించే అభ్యర్థుల విషయంలో అప్రెంటిస్ షిప్ శిక్షణ నుండి నిలిపివేయబడుతారు. అప్రెంటిస్ లకు సాధారణ వీక్లీ ఆఫ్ లు మరియు సంవత్సరానికి 12 CL  లు అనుమతించబడుతాయి. ఒక అప్రెంటిస్ కు నిర్దేశించిన సెలువులకు అర్హత ఉంటుంది.శిక్షణ పొందుతున్న సంస్థలో 25 సెలువులు పాటించబడుతాయి. అప్రెంటిస్ షిప్ వ్యవధి పూర్తి అయిన తర్వాత అప్రెంటిస్ కు ఏదైనా ఉపాధిని అందించడం యజమాని యొక్క పక్షాన విధిగా ఉండదు.