SSC Sub Inspector, Inspector, Assistant Audit Officer and Other Notifications ( SSC ఇన్స్పెక్టర్, సబ్-ఇన్స్పెక్టర్ మరియు ఇతర)

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి ఇన్స్పెక్టర్, సబ్-ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, టాక్స్ అసిస్టెంట్ మరియు ఇతర పోస్టులు భారీ నోటిఫికేషన్ విడుదల అయినది. కావున ఈ నోటిఫికేషన్ కి సంబధించిన పూర్తి వివరాలను క్లుప్తంగా వివరించనైనది. అర్హులు అయిన అభ్యర్ధులు పూర్తి వివరాలను పరిశీలించి అప్లై చేసుకోగలరు.

మొత్తం పోస్టులు : 7,500

ముఖ్యమైన తేదీలు

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభమైన తేది : 03-04-2023

అప్లై చేసుకోవడానికి చివరి తేది : 03-05-2023

పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేది : 04-05-2023

చలాన్ ద్వారా పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేది : 05-05-2023

అప్లికేషన్ లోని తప్పిదాలను సరిదిద్దుటకు తేదీలు : 07-05-2023 నుండి 08-05-2023 వరకు

టైర్-I పరీక్ష తేది : జూలై 2023

టైర్-II పరీక్ష తేది : తేదీలు ప్రకటించలేదు

విద్యార్హతలు

 గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా పొంది ఉండవలెను. అలాగే మీరు అప్లై చేసుకోవాలనుకున్న పోస్టుకు తగిన ప్రాధాన్యత కలిగిన విద్య నందు ఉత్తిర్ణత కలిగి ఉండవలెను.

వయస్సు నిబంధనలు మరియు పోస్టులు

క్ర. సం

పోస్టు పేరు

వయస్సు నిబంధనలు

1

Assistant Audit Officer

18-30 సం”

2

Assistant Section Officer

18-30 సం”

3

Inspector of Income Tax

18-30 సం”

4

Assistant Enforcement Officer

18-30 సం”

5

Sub Inspector

20-30 సం”

6

Inspector Posts

18-30 సం”

7

Inspector

18-30 సం”

8

Assistant / Assistant  Section Officer

18-30 సం”

9

Executive Assistant

18-30 సం”

10

Research Assistant

18-30 సం”

11

Divisional Accountant

18-30 సం”

12

Sub Inspector

18-30 సం”

13

Sub-Inspector / Junior Intelligence Officer

18-30 సం”

14

Junior Statistical Officer

18-32 సం”

15

Auditor

18-27 సం”

16

Accountant

18-27 సం”

17

Junior Accountant

18-27 సం”

18

Postal Assistant/ Sorting Assistant

18-27 సం”

19

Senior Secretariat Assistant/ Upper Division Clerks

18-27 సం”

20

Senior Administrative Assistant

18-27 సం”

21

Tax Assistant

18-27 సం”

  • పైన తెలియ చేసిన వయస్సు వివరాలు 01-08-2023 తేది వరకు వర్తిస్తాయి.

వయస్సు సడలింపు వివరాలు

  • ST / SC అభ్యర్ధులకు : 5 సంవత్సరాలు
  • BC / EWS అభ్యర్ధులకు : 3 సంవత్సరాలు
  • అంగవైకల్యం కలిగిన SC/ST అభ్యర్ధులకు : 15 సంవత్సరాలు
  • అంగవైకల్యం కలిగిన OBC అభ్యర్ధులకు :  13 సంవత్సరాలు
  • అంగవైకల్యం కలిగిన జనరల్ (UN) అభ్యర్ధులకు : 10 సంవత్సరాలు
  • మాజీ సైనికులకు : ఉద్యోగం నుండి విరామం పొందిన నుండి 3 సంవత్సరల వరకు వయస్సు సడలింపులు వర్తిస్తాయి.

పరీక్ష రుసుము వివరాలు

  • ST / SC / అంగవైకల్యం / మహిళల అభ్యర్ధులకు ఎటువంటి పరీక్ష రుసుము లేదు.
  • OC / BC / EWS అభ్యర్ధులకు 100/- రూపాయలు
  • పరీక్ష రుసుము ఆన్లైన్ పేమెంట్ ద్వార మాత్రమే చెల్లించవలసి ఉంటుంది.

అప్లై చేసుకునే విధానం

అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలు కల్పించారు. దీని కోసం https://ssc.nic.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్  చేసుకోవచ్చు. అప్లై చేసుకొనే విధానాన్ని ప్రతి విషయాన్నీ క్లుప్తంగా నోటిఫికేషన్ (PDF) లో పూర్తిగా 9 వ పాయింట్ లో వివరించడం జరిగింది. క్రింద నోటిఫికేషన్ తెరిచి పరిశీలించగలరు.

పరీక్ష కేంద్రాలు

ఇందుకోసం పరీక్ష కేంద్రాలు దక్షిణ ప్రాంతాలు రాష్టాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు పుదుచ్చేరిల కోసం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం, తిరుపతి, రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, గుంటూరు, చీరాల, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సేలం, తిరుచిరాపల్లి మరియు తిరునెల్వేలి నగరాలు పరీక్ష కేంద్రాలుగా అందుబాటులో ఉన్నాయి.

పరీక్ష విధానం

కంప్యుటర్ ఆధారిత పరీక్ష (ఆన్లైన్ ఎక్షమ్) కావున పరీక్ష అందరు అభ్యర్ధులకు ఒకేసారి కాకుండా పరీక్ష విడతలవారిగా పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష టైర్-I, టైర్-II రెండు దశల్లో నిర్వహించబడుతుంది. టైర్-I లో నెగెటివ్ మార్కులు ప్రతి తప్పు సమాధానానికి 0.50 (1:2) మార్కులు తిసివేయ్యబడుతాయి.