APSRTC Apprentice

APSRTC నందు అప్రెంటిస్షిప్ చేయుటకు ఆసక్తి కలిగి, ఈ క్రింది కనపరిచిన ట్రేడ్ల నందు I.T.I ఉతిర్ణులైన వారు 01.11.2023  నుండి 15.11.2023 వ తేది లోగ ఆన్లైన్ వెబ్సైట్ అడ్రస్ www.apprenticeshipindia.gov.in నందు దరఖాస్తు చేసుకోవలసినదిగా తెలియచేయడమైనది. 15.11.2023 వ తేది తదుపరి తేదిలలో దరఖస్తు చేసుకోన్న వారి దరఖాస్తులు ఎట్టి పరిస్థితులలో పరిగణన లోకి తీసుకోబడవు.అభ్యర్థులు క్రింద తెలుపన సూచనలను చదవి వాటికీ తప్పక పాటించవలసినదిగ కోరడమైనది.

కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య జిల్లాల నందు I.T.I ల నుండి ఉతిర్ణులైన వారు మాత్రమే అర్హులు.

ట్రేడ్స్ మరియు జిల్లాల వారిగా ఖాళీల వివరాలు:

  1. కర్నూల్ : 49
  2. నద్యాల : 50
  3. అనంతపురం : 52
  4. శ్రీ సత్య సాయి : 40
  5. కడప : 67
  6. అన్నమయ్య : 51

2) నమోదు చేయు విధానం : ITI ఉత్తిర్ణులైనఅభ్యర్థులు వారి పూర్తి వివరములను ఆన్లైన్ వెబ్సైటు అడ్రస్ www.apprenticeshipindia.gov.in  నందు నమోదు చేసుకున్న తర్వాత వారు వెబ్సైటు నందు లాగిన్ అయ్యి వారు అప్రెంటిస్షిప్ చేయదలచుకున్న జిల్లా ను ఎంచుకొని పోర్టల్ ద్వారనే అప్లై చేయవలెను.జిల్లా మరియు ఎస్టాబ్లిష్మెంట్ వివరములు ఈ క్రింద కనపరచబడినది

S.NO

జిల్లాలు

ఎస్టాబ్లిష్మెంట్ వివరాలు

1

కర్నూల్

APSRTC కర్నూల్

2

నంద్యాల

APSRTC నంద్యాల

3

అనంతపూర్

APSRTC అనంతపురం

4

శ్రీ సత్య సాయి

APSRTC శ్రీ సత్య సాయి

5

కడప

APSRTC కడప

6

అన్నమయ్య

APSRTC అన్నమయ్య

3) రుసుము :APSRTC  నందు అప్రెంటిస్ కొరకు ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపిలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది ఏ.పి.యస్.ఆర్.టి.సి. బళ్లరి చౌరస్తా ,కర్నూల్ నందు హాజరు కవలసియుండెను.వెరిఫికేషన్ కు హాజరు అయ్యే అభ్యర్థులు రూ. 118/- (100+18% GST) రుసుముతో చెల్లించవలెను.వెరిఫికేషన్ జరుగు తేదీ దినపత్రిక ద్వార తెలియజేయబడును.

4) సర్టిఫికెట్స్ మరియు నకళ్ళు: ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెనువెంటనే ఈ క్రింద తెలిపిన సర్టిఫికెట్స్ యొక్క నకలును మా కార్యాలయమునకు 16.11.2023 తేది లోగా పంపించవలసినదిగా కోరడమైనది.సర్టిఫికెట్స్ ను పంపునపుడు తగిన విదముగా పూర్తి చేసిన Resume తో పాటుగా పంపవలెను కాపి ని ఇందువెంట జతచేయడమైనది.

పంపవలసిన సర్టిఫికెట్స్ నకళ్ళు :

  • ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి యొక్క ప్రొఫైల్
  • apprenticeshipindia.gov.in పోర్టల్ నందు అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ (ARN)
  • SSC Mark Sheet
  • ITI marks (consolidated marks memo)
  • NCTV Certificate
  • కుల ధృవీకరణ పత్రము –SC/ST/BC (పెర్మనెంట్ సర్టిఫికేట్ లేనియెడల ఆరు నెలల లోపు జారి చేయబడిన తాత్కాలిక కుల ధృవీకరణ పత్రము
  • వికలంగులైనచో ధృవీకరణ పత్రము
  • మాజీ సైనికోద్యోగుల పిల్లలైనచో ధృవీకరణ పత్రము
  • NCC మరియు స్పోర్ట్స్ ఉన్నచో సంబదిత ధృవీకరణ పత్రములు
  • ఆధార్ కార్డు
  • సర్టిఫికెట్స్ నకళ్ళు పంపవలసిన చిరునామా :

Principal,

Zonal staff training college,

APSRTC,

Bellary Chowrastha, Kurnool (Po) & (Dt)

  1. C) ఈ నోటిఫికేషన్ తో పాటు అభ్యర్థి Resume నమునా జతచేయడమైనది.అభ్యర్థులు Resume నకలును Print తీసుకొని.అందులోని అన్ని వివరములు పొందుపరచావలెను.సర్టిఫికెట్స్ తో పాటు Resume జత చేసి పైన తెలిపిన చిరునామా కు పోస్టు ద్వార పంపవలెను.

D)ఇంటర్వ్యూ కు హాజరైనప్పుడు అభ్యర్థులు పైన తెలిపిన తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు ఒక జాత నకలు తీసుకు రావలెను.

ముఖ్య గమనిక :

  • ఆన్లైన్ నందు 15.11.2023 వ తేదీ లోగ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్ కొరకు హాజరు కావలెను.ఆన్లైన్ లో సమర్పిపించిన దరఖస్తులు మాత్రమే స్వికరించాబడును.వేరే ఏ మధ్యము ద్వార సమర్పించినానుస్వికరించాబడవు.
  • ఆన్లైన్ దరఖాస్తు నందు అధార్ కార్డు ను తప్పనిసరి నమోదు చేయవలెను (E-KYC) మరియు అధార్ కార్డులో ఉన్న వివరములు SSC సర్టిఫికెట్స్ లో ఉన్నటువంటి వివరములతో సరిపోవలెను.
  • పోర్టల్ నందు అప్రెంటిస్షిప్ కొరకు అప్లై చేయునప్పుడు ఏమైనా సందేహముల ఎడల మీరు మీ Govt I.T.I కాలేజీ నందు సంప్రదించవలెను.
  • ఏదైనా సందేహము వున్నా ఎడల Phone No: 08518-257025,7382873146 లకు మాత్రమే అనగా ఉ: 10.30 గంటల నుండి సా 5 : 00 గంటల వరకు సంప్రదించవలసినదిగా కోరడమైనది.
  • ఈ ప్రకటన మీకు దగ్గరలోని డిపో మేనేజర్ వారి కార్యాలయం నోటీసు బోర్డు నందు కూడా చూడవచ్చ.
  • ఈ ప్రకటన APSRTC website apsrtc.ap.gov.in నందు కూడా చూడవచ్చు.